14-09-2025 10:00:32 PM
సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన జర్నలిస్ట్ ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.. జర్నలిస్టు లకు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని, జర్నలిస్టులు బయటకు కనబడేంత లోపట ఉండదని వారికి చాలా కష్టాలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టు లకు అన్ని విధాల సహాయం చేసామని, కరోనా సమయంలో నేను ఆరోగ్య శాఖ మంత్రి గా ఉండి అనేకమంది జర్నలిస్టులను కాపాడుకున్నామని గుర్తు చేశారు.
బిఆర్ఎస్ అదికారంలో ఉన్నప్పుడు మన సిద్దిపేట కు చాలా రాష్ట్రంల నుండి సిద్దిపేటను చూడడానికి వచ్చారని.. సిద్దిపేట దేశానికి ఆదర్శం గా నిలుపుకున్నామని చెప్పారు.. సిద్దిపేట ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడి వచ్చి చూసి నేర్చుకొని వెళ్లారు.. సిద్దిపేట అభివృద్ధి పాఠం..ప్రగతి కి ప్రయోగ శాల అని మేచ్చుకున్నారన్నారు.. భారతదేశంలో ని చాలా మంది ఇతర దేశాల వారు మన ఇబ్రహింపూర్ కు వచ్చి చూసారన్నారు..భారతదేశంలో ఉండే బ్రటిష్ అంబాసిడర్ వచ్చి చెత్త కాంపోస్ట్ తయారి విధానాన్ని చూశారని ఎంతో మంది సిద్దిపేట భేష్...!! అన్నారు.
అయిల్ ఫామ్ తోటలు అంటే తెలియని వారికి అ పంటను పరిచయం చేసి అత్యదికంగా దిగుబడి వచ్చేలా చేసామని.. కానీ నాడు విజయ గాధల సిద్దిపేట ను మీరు ఎంతో అద్భుతం గా వ్రాసారు అలాంటి సిద్దిపేట నేడి అభివృద్ధి పనులు ఆగిపోయి వెక్కినరించే విధంగా మారిందని అభివృద్ధి ని అర్థంతరంగా ఆగిన సిద్దిపేట గా అయిందని ఆవేదన వ్యక్తం చేసారు.. మన ఈరోజు చూస్తే అభివృద్ధి మొత్తం ఆగిపోయింది.. సిద్దిపేట కు మంజూరు అయిన వెటర్నరీ కళాశాల ను కొడంగల్ కు తరలించుక పోయాడు..
సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కొరకు నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి పనులు అర్థాంతరంగా అపారన్నారు.. చిన్నకోడుర్ ఫోర్ లైన్ రోడ్ మద్యలోనే అగిపోయినాయి. రెండు సంవత్సరాల లో అవుటర్ రింగ్ రోడ్డులో ఉండే గుంతలను కూడా పూడ్చలేదన్నారు.. శిల్పా రామం శిలా పలకానికే పరిమితం అయిందన్నారు. అ రోజు విజయాలను వార్తలుగా రాశారు ఇప్పుడు సిద్దిపేట అభివృద్ధి కష్టాలపై కూడా సిద్దిపేట జర్నలిస్ట్ లుగా బాధ్యతగా అలోచించండి. రెండు సంవత్సరాల లో ఒక్క రూపాయి కూడా రాలేదు.. ఒక్క పని కూడా జరగలేదన్నారు. పాతవి ఆపారు.. కొత్త పనులు ఒక్కటి తేలేదని చెప్పారు.