14-09-2025 10:31:25 PM
గచ్చిబౌలి,(విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నూతన కన్వెన్షన్ సెంటర్ వద్ద ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. అక్కడే పని చేస్తున్న కూలీలలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.