calender_icon.png 15 September, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

14-09-2025 10:15:38 PM

జిల్లా కాంగ్రెస్ నాయకులు కొన్నేరు సత్యనారాయణ (చిన్ని)

కొత్తగూడెం,(విజయక్రాంతి): యువకులు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు కొన్నేరు సత్యనారాయణ(చిన్ని) అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ నందు పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు షమీఉద్దిన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బెంచ్ ప్రెస్ ఎంకరేజ్ మెంట్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ సందర్భాగం చిన్ని మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని, ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు. మనం ఏదైతే లక్ష్యం నిర్దేశించుకుంటామె దాని పలితం కోసం మనమే కష్టపడాలని ప్రతీ కష్టానికి పలితం తప్పకుండా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకొని ఆలక్ష్యం కోసం 365 రోజుకు నిరంతరం సాధన చేయాలని సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదన్నారు.