14-09-2025 10:03:18 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): లంబాడీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటుచేసిన ఛలో భద్రాద్రి కొత్తగూడెం సభకు ఇల్లందు నుండి లంబాడి సోదరులు భారీగా తరలి వచ్చారు. కొత్తగూడెం జిల్లా వేదికగా రాజకీయ పార్టీలకు సంఘాలకు అతీతంగా తరలివచ్చి సమన్వయం పాటిస్తూ జాతి ఐక్యతను చాటుకున్నారు. లంబాడి జాతికి రాజ్యాంగ ప్రకారం పార్లమెంటులో చట్టబద్ధతతోటే రిజర్వేషన్ ఏర్పడిందని కావాలని కొందరు ఆదివాసి బంజారా సోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భూక్య రమేష్ నాయక్, చాందావత్ రమేష్ బాబు, బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.