calender_icon.png 15 September, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ గారు.. మా సమస్యలు వినండి

14-09-2025 10:08:55 PM

 సమస్యలను సాగదీస్తున్న వైనం

 వీటికి పరిష్కారం ఎప్పుడు?

 అలంకార ప్రాయంగా భవనాలు!

నల్గొండ రూరల్: మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేక సమస్యలకు నిలయంగా మారింది. అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా ఉందనే ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి. గవర్నర్ మా సమస్యలు ఆ లకించాలని విద్యార్థులు కోరుతున్నారు. 2016లో 10 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన అంపి థియేటర్లో నేటికీ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం శోచనీయం దక్షిణ భారతదేశంలోనె అతి పెద్ద ఇండోర్ స్టేడియంగా భావించే విధంగా ఉన్న స్టేడియాన్ని 2016 లో 20 కోట్లతో నిర్మించినా క్రీడా సామాగ్రి, క్రీడలు నిర్వహించకపోగా  గోడౌన్ గా మిగిలిపోయింది. నాణ్యత లోపం గా నిర్మించిన భవనాలు వర్షానికి కురుస్తున్నాయి.

15 కోట్లతో 2016లో టీచింగ్ సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మించినప్పటికీ అందులో ఉండకుండా హైదరాబాదు నుండి రాకపోకలు సాగిస్తున్నారు. వీడికి హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారు. యూనివర్సిటీలో ఉదయం 10 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అధ్యాపకులు అందుబాటులో ఉంటూరని, 5 గంటలు దాటితే అధ్యాపకులు ఉండరని విద్యార్థులు చెబుతున్నారు. కేవలం వి సి, రిజిస్టార్ మాత్రమే యూనివర్సిటీ కోటర్స్ లో అందుబాటులో ఉంటున్నారు. దీంతో విద్యార్థులకు ఏదైనా సమస్య ఉన్నా హాస్టల్ నిర్వహణ కష్టంగా మారుతుంది. పర్యవేక్షణ లోపం కారణంగా గతంలో ప్రేమ వ్యవహారంలో యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి హైదరాబాదులో హత్యకు గురై సంచలనంగా మారింది.

 పి హెచ్ డి లు అలంకారప్రాయమే నా...

  సి హెచ్ డి లో చేరేది అధికంగా పదోన్నతుల కోసం వేరే ఉద్యోగులే. స్థానికంగా ఉండి యూనివర్సిటీలో పరిశోధనలు కొనసాగించే విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉందిని తెలుస్తుంది. కన్సల్టెన్సీ లతో మాట్లాడుకుని పరిశోధన పత్రాలు అందజేస్తున్నట్టు తెలుస్తుంది. పరిశోధనలలో చేరే విద్యార్థులకు చేరే సమయంలోనే ఇక్కడ రీసెర్చ్ ఉండదు.మీ రీసెర్చ్ ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలనే  చెబుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిశోధనలతో అధ్యాపకులకు పదోన్నతులకు పనికొస్తాయి తప్ప విద్యార్థులకు, సమాజానికి ఏ మాత్రం పనికిరావు. రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగానే ఉన్నది. కాంట్రాక్ట్, పార్ట్ టైంగా కొందరు అధ్యాపకులు కొనసాగుతుండగా,35 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. గత ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేసింది కానీ యూనివర్సిటీ వారిని గాలికి వదిలేశారు. పార్ట్ టైం అధ్యాపకుల కారణంగా యూనివర్సిటీకి న్యాక్ లో సరైన గుర్తింపు రాలేదు.

ఇంజనీరింగ్ కాలేజీలోనేటికీ రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం గమనార్వం  తేలని ఆ 32 మంది అంశం  2012లో జరిగిన 32 మంది రెగ్యులర్ రిక్రూట్మెంట్ అత్యంత వివాదాస్పదం గా మారింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో వి సీ నియమ నిబంధనను పాటించకుండా బర్తి చేశారన్న విమర్శలు వచ్చాయి.ఈ నియామకాలపై 2016లో కేసీఆర్ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించి అక్రమాలు జరగాలని నెగ్గు తేల్చింది. అప్పటి, నేటి విసి పాలకమండలి ఆమోదంతో అప్పటి రిజిస్టర్ యాదగిరి పేరు మీద అక్రమంగా నియామకమ్యారని తొలగింపు నోటీసులు ఇచ్చారు.

దీంతో వారు కోర్టుకు వెళ్లి   స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ 32 మందిలో ఒకరిని రిజిస్టర్ చేసి  ఆ కేసుని వారే నడిపించుకునేలా వ్యవహారం నడిపారు.కోర్టు కేసులపై పాలకమండలిలో చర్చించకపోవడం పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా నియామకమైన ఓ యూనివర్సిటీలో అధ్యాపకులు పూర్తిగా తొలగించారు. మహాత్మా గాంధీలో మాత్రం కొనసాగడం అనేక అనుమానాలకు స్థానం కల్పించింది.అక్రమాలు నిర్ధారణ అయిన తర్వాత కూడా 14 ఏళ్లుగా విధులు నిర్వహించడం యూనివర్సిటీకే దక్కింది.