calender_icon.png 15 September, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ కళాశాలకు( కోఎడ్) ప్రొజెక్టర్ అందజేత

14-09-2025 10:26:15 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా డిజిటల్ విద్యా సౌకర్యాలు పొందాలని, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలని లక్ష్యంగా చతుర్వేది అభినవ (సర్కిల్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్), సంజివ్ (సర్కిల్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్), సాజిద్ (జోనల్ ఇన్స్పెక్టర్ నిజామాబాద్) ముగ్గురు అధికారులు కలిసి కళాశాలకు రూ.30,000 విలువ గల ప్రొజెక్టర్‌ను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “విద్యార్థులు చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.

కష్టపడి చదివితే గ్రామీణ విద్యార్థులు కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరు. డిజిటల్ విద్యను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను సాధించాలి” అని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం,ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శివకుమార్, సీడీసీ సభ్యులు ఏజాజ్ , దాసరి శ్రీనివాస్ , అధ్యాపకులు సురేష్,నరేష్ ,బాబా సాహెబ్ , వజహత్,శంకర్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.అధికారుల సహకారంతో తమకు విలువైన డిజిటల్ సదుపాయం లభించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, వారికి కృతజ్ఞతలు తెలిపారు.