calender_icon.png 6 July, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం సాధన కమిటీకి ఘన సన్మానం

05-07-2025 07:42:01 PM

ఉద్యమ స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని  డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం కోసం ఉద్యమించిన అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీని శనివారం ఘనంగా సన్మానించారు. మూల స్తంబాలుగా నిలువబడి, నిరహార దీక్ష చేసిన అంబేద్కర్ విగ్రహ సాధన కు కృషిచేసిన  వారిని దళిత, బహుజన సంఘాల జే.ఏ.సి.నాయకులు, లగడపాటి. రమేష్ సన్మానించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి, పూల మాల వేసి, ఘనమైన నివాళ్లు అర్పించి,అనంతరం విగ్రహ సాధన కమిటీ వేల్పుల. నరసింహరావు,సిద్దెల.రవి, సిద్దెల.తిరుమలరావు, కశిమెల్ల, రమేష్, దేపంగి, వెంకటరమణ లను పూల మాల, శాలువతో సన్మానించి జై భీమ్ లు తెలిపిన్నారు.