05-07-2025 07:40:30 PM
భద్రాచలం (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన కుటుంబాల సౌకర్యార్థం అశ్వరావుపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 7 తేదీ సోమవారం నిర్వహించే గిరిజన ప్రజావాణి (దర్బార్) అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. మరల ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని అందుకు ఆదివాసి గిరిజనులు ఎవరు అశ్వరావుపేట ఎంపీడీవో కార్యాలయానికి దరఖాస్తులు ఇవ్వడానికి వెళ్లకూడదని ఆయన కోరారు.