calender_icon.png 6 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమమే!

06-07-2025 12:33:35 AM

  1. ఈనెల 1200 కోట్లు చెల్లించాలి

ప్రభుత్వానికి టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అల్టిమేటం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావాల్సిన వివిధ రకాల పెండింగ్ బిల్లులల ను ప్రభుత్వం చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని టీచర్ ఎమ్మెల్సీ పిం గలి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ స మావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుం డు లక్ష్మణ్ అధ్యక్షతన శనివారం నిర్వహించా రు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలకు రూ.700 కోట్లను చెల్లిస్తామని హామీ ఇచ్చి గత నెలలో కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. గత నెలతోపా టు ఈనెల కలుపుకొని మొత్తం రూ. 1,200 కోట్లను చెల్లించి మాట నిలుపుకోవాలని కో రారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించాలని పేర్కొన్నా రు.

సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, నాయకులు పేరి వెం కట్ రెడ్డి, మనోహర్ రావు, కే.నర్సింహారెడ్డి, వంగ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.