18-12-2025 12:43:34 AM
కొత్తగూడెం, డిసెంబర్ 17, (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ,కొత్తగూడెం కు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ బి ఎస్ రావు ఏకగ్రీవంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (డాక్టర్స్)సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ రావు మాట్లాడుతూ, నాపై సభ్యులంతా ఎంతో నమ్మకంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు, బాధ్యతగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేలా, కృషి చేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు నిరుపేద ప్రజలకు ప్రైవేటు వైద్యం కూడా తక్కువ ఖరీదుతో నాణ్యమైన వైద్యం అందించడానికి నిజాయితీగా కృషి చేస్తానని ,డాక్టర్ బి ఎస్ రావు , ఈ సందర్భంగా తెలియజేశారు..