18-12-2025 12:44:15 AM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్: తాను పార్టీ మారలేదని, కేవలం తన నియోజకవర్గమైన గద్వాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని, ఇతర మంత్రులను కలిశానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వా గతించారు. ఫిరాయింపుల ఫిర్యాదులపై ‘క్లీన్ చిట్’ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వాన్ని సంప్రదించడం సహజమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. కొందరు బిఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కోర్టులకు వెళ్లి లేని వివాదాలను సృష్టించడం బాధాకరమని అన్నారు. జడ్జిమెంట్ కాపీ పూర్తిగా అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన పునరుద్ఘాటించారు.