07-07-2025 12:00:00 AM
బాన్సువాడ, జూలై 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో గల తెలంగాణ మినీ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మేర యూవ భారత్ ,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మై భారత్ వాలంటీర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ అఖండ భరతభూమి కోసం ప్రాణాలర్పించిన మహా నేత జయంతి సందర్భంగా బాలికలకు చిత్రలేఖన పోటీలు, క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రయదర్శిని,కల్యాణి,సునీత తదితరులు పాల్గొన్నారు.