calender_icon.png 7 July, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శాకాంబరీ దేవి అమ్మవారి పూజలు

07-07-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, జూలై 6 (విజయక్రాంతి): తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని కాగజ్ నగర్ పట్టణంలోని నిత్య అన్నదాన కేంద్రంలో ఆదివారం శాకాంబరి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలు, పండ్లు, కూరగాయలతో ప్రత్యే కంగా అలంకరించారు.

మాజీ ఎమ్మెల్యే కోనే రు కోనప్ప ఆయన సతీమణి కోనేరు రమాదేవి, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఆయన సతీమణి కోనేరు రుక్మిణి ఆధ్వర్యం లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా గోరింటాకు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం లోమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.