calender_icon.png 8 December, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా.శ్రీనివాస్‌కు ‘విజయ్ సమాన్’ పురస్కారం

05-12-2025 12:00:00 AM

నంగునూరు, డిసెంబర్ 04:దంత వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సిద్దిపేటకు చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ప్రతిష్టాత్మక ’విజయ్ సమాన్’ పురస్కారం వరించింది.నిస్వార్థ సేవలకు తమ వృత్తి నైపుణ్యంతో పాటు సామాజిక సేవకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.సిద్దిపేటలో శ్రీనివాసా సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ నాయక్, అత్యాధునిక దంత వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు.

కేవలం క్లినిక్కే పరిమితం కాకుండా,తమ వైద్య వృత్తిలో సామాజిక బాధ్యతను విస్మరించకుండా ,తమ సొంత నంగునూరు మండలం గ్రామం సీతారాంపల్లి తండా (గట్లమల్యాల) తో జిల్లాతో సహా అనేక మారుమూల ప్రాంతాలు,తండాల్లో తరచూ ఉచిత దంత వైద్య శిబిరాలు,ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.డా.శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల ప్రజలను ఎన్నటికీ మర్చిపోనుఆని,పట్టణంలో ఆధునిక వైద్యం అందించడంతో పాటు,ఆరోగ్య సేవలు సరిగా అందని తండాలు, గ్రామాల ప్రజలకు దంత వైద్యం గురించి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత చాలా ఆనందంగా ఉందన్నారు.