calender_icon.png 24 February, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో డ్రైనేజీ అవుట్ లెట్ పనులు ప్రారంభం

24-02-2026 12:14:50 AM

బడంగ్పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి):మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి సామ్రాట్ నగర్ నివాసితుల చిరకాల స్వప్నమైన భూగర్భ డ్రైనేజీ అవుట్ లెట్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం బడంగ్పేట్ సర్కిల్, మీర్పేట్ 60వ డివిజన్ పరిధిలోని సాయి సామ్రాట్ నగర్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు.

డ్రైనేజీ సమస్యను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆమె సానుకూలంగా స్పందించారు.ఎమ్మెల్యే సూచన మేరకు, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళను కలిసి కాలనీ వాసుల ఇబ్బందులను వివరించారు. జోనల్ కమిషనర్ ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు సోమవారం స్థలాన్ని పరిశీలించి, పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

డ్రైనేజీ అవుట్ లెట్ నిర్మాణంతో సాయి సామ్రాట్ నగర్తో పాటు చుట్టుపక్కల ఉన్న పలు కాలనీల డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనట్లు వారు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే సబితకు, కమిషనర్ చంద్రకళకు అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. డీఈ వెంకన్న, ఏఈ సౌమ్య, వర్క్ ఇన్స్పెక్టర్ అశోక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు లక్ష్మారెడ్డి, విమల్ శుక్ల, పర్వతాల్ రెడ్డి పాల్గొన్నారు.