4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

షెడ్యూల్ తెగల సమస్యలపై భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు వినతి

18-09-2025 12:23 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : షెడ్యూల్ తెగల సమస్యల పై పోచారం మున్సిపల్ అన్నోజిగూడకు చెందిన జాతీయ గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు, బిజెపి తమిళనాడు రాష్ట్రం ఇంచార్జి ననావత్ బిక్కునాథ్ నాయక్ బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి దేశంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగల సమస్యలు, గిరిజనుల హక్కుల గురించి వినతిపత్రం అందజేశారు. మన సమాజం అవకాశాలు అభివృద్ధి పొందేందుకు వీలు కల్పించడంలో  గిరిజనులు కీలకపాత్ర పోషించారు.

రాజ్యాంగ అధికారం మరియు సామాజిక న్యాయం గిరిజన వర్గాల సాధికారిక పట్ల మీ నిబద్ధతపై మా పూర్తి విశ్వాసం ఉన్నదన్నారు. మాతో సహా అన్ని అనగారిన వర్గాల హక్కులను కాపాడటం నిలబెట్టడం కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. మీ మార్గదర్శకత్వంలో భారత రాజ్యాంగ విలువలు న్యాయం, అందరికీ సమానత్వం మరియు గౌరవం సంరక్షింపబడి బలోపేతం అవుతాయని విశ్వసిస్తున్నామన్నారు.