calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడిసిటీ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన

18-09-2025 12:25:09 AM

మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): సెప్టెంబర్ మాసం జాతీయ చిన్న పిల్లల ఉబకాయం సందర్భంగా మెడిసిటీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేడ్చల్ మండలంలోని రాజు బొల్లారం తండా, యాదారం గ్రామాలలో మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఉబకాయంపై తీసుకోవలసిన చర్యలపై తల్లిదండ్రులకు వివరించారు.

అలియాబాదులోని దక్ష హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఘనపూర్ లోని పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి చర్య విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఫిరియాట్రిక్ వైద్య విభాగానికి చెందిన విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ రాజ్ నేతృత్వంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ ప్రీతి, డాక్టర్ మహిత, డాక్టర్ మనోహర్, డాక్టర్ బద్రి, డాక్టర్ శంకర్, డాక్టర్ అరవింద్ పాల్గొన్నారు.

షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ దేవేంద్ర, డైరెక్టర్ డాక్టర్ సి గీత, డాక్టర్ మీనాక్షి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రెసిడెంట్ శివరామకృష్ణ విద్యార్థులను అభినందించారు.