calender_icon.png 1 May, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.20 లక్షల విలువైన ఎండు గంజాయి సీజ్

01-05-2025 12:00:00 AM

ఎస్పీ పరితోష్ పంకజ్ 

జహీరాబాద్, ఏప్రిల్ 30 : అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన 80 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ మంగళవారం నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ టీం, చిరాగ్‌పల్లి ఎస్.ఐ రాజేం దర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి మాడ్గి టి రోడ్డు జాతీయ రహదారి 65 పక్కన వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి కర్ణాటక వైపు అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఇండిగో కారును ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కారు డిక్కీలో 40కిలోల ఎండు గంజాయి ప్యాకె ట్లు లభించినట్లు చెప్పారు.

దీంతో కారు డ్రైవర్, నిందితుడు తిరుమలేష్‌ను విచారించగా బీదర్ కు చెందిన గుండప్ప చెప్పడం వల్ల ఎండు గంజాయి ప్యాకెట్లను బాగ్దాల్‌లో ఉన్న వినోద్‌కు ఇవ్వడానికి వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపారు. కాగా నిందితుని వద్ద లభించిన ఎండు గంజాయి 80 కిలోల వరకు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందన్నారు.

నిందితున్ని అదుపులోకి తీసుకొని అతని కారు, సెల్‌ఫోన్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపా రు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పోలీసు శాఖ ఉక్కుపా దం మోపుతుందని, ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించా రు. గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.