calender_icon.png 1 May, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో మంటోసరి విద్యార్థుల ప్రభంజనం

30-04-2025 10:32:44 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మంటోసరి పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గీతషాజు తెలిపారు. పాఠశాలకు చెందిన ఖతీజా జర్ఫీన్ కు 588/600 యం.సంజనకు 573/600 మార్కులు పొందగా 550 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు, 500 మార్కుల పైన 33 మంది విద్యార్థులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% ఫలితాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. ఈ ఫలితాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆమె అభినందనలు తెలిపారు.