calender_icon.png 12 July, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల వినియోగంతో మానవాళికి ప్రమాదం

23-06-2025 12:00:00 AM

సీఐ  రామకృష్ణరెడ్డి

మోతె, జూన్ 22 మాదక ద్రవ్యాల తో మానవాళికి ప్రమాదం కలుగుతుందని మునగాల  సి ఐ రామ కృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మామిళ్ల గూడెం గ్రామం లో ఏర్పాటు  చేసిన అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన  రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న అలాంటి వారిని గుర్తించి  పోలీసులకు సమాచారం  అందించి డ్రగ్స్  నివారించడంలో సహకరించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నారు. 

రోజువారి కూలీ జీవనం గడుపుతూ వచ్చిన డబ్బులను మత్తు పదార్థాల కోసం వృధా చేసుకోవద్దని ఆర్థికంగా నష్ట పోవద్దని  కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గట్టి కొప్పుల వీరా రెడ్డి, మాజీ యం పి టి సి నిమ్మల శేషగిరి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.