31-07-2025 01:18:37 AM
-స్క్రాప్ తగులబెడుతుండగా ఘటన
-ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పివేత
పటాన్‌చెరు, జూలై 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో పేయిం ట్ డ్రమ్ముల పేలుడు సంభవించింది. పారిశ్రామిక వాడకు ఆనుకొని ఉన్న చెట్ల పొద ల్లో బుధవారం స్క్రాప్‌ను తగులబెడుతుండగా అందులో ఉన్న పేయింట్ డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు చెలరేగాయి.
మంటలు ఎక్కువకావడంతో పారిశ్రామికవాడలో ఉన్న ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇ చ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేశాయి. పారిశ్రామికవాడలో రసాయన డ్ర మ్ములు పేలాయని వార్తలు బయటకు రావడంతో చుట్టు పక్కల ఉన్న రసాయన పరిశ్ర మల ప్రతినిధులు, కార్మికులు ఆందోళనలకు గురయ్యారు. స్క్రాప్ తగులబెడుతుండగా పేయింట్ డ్రమ్ములు పేలాయని తెలియడంతో పారిశ్రామిక ప్రజలు, కార్మికులు కుదుటపడ్డారు.