calender_icon.png 9 August, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అమ్ముల పొదిలో ఆధునిక వాహనం

31-07-2025 01:19:39 AM

జిల్లాకు చేరిన మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్

మహబూబాబాద్, జూలై 30 (విజయ క్రాంతి): నేర దర్యాప్తులో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, త్వరితగతిన కేసులను పరిష్కరించడానికి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ అమ్ముల పొదిలో ఆధునిక పరికరాలతో ఫోరెన్సిక్ వ్యాన్ వచ్చి చేరింది. ప్రాంతీయ మొబైల్ లేబరేటరీ వాహనం బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చింది.

ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ ఇంతకుముందు జిల్లా స్థాయిలో ప్రాంతీయ ప్రయోగశాలలో అందుబాటులో లేకపోవడం వల్ల దర్యాప్తు ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉండేవని, ఇప్పుడు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి రావడంతో ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వేగవంతంగా వినియోగించి నేర పరిశోధనలు చేయడానికి అణువుగా మారిందని చెప్పారు.

మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ వల్ల ఆన్ సైట్ ఆధారాల సేకరణ, నేర స్థలాలకు వెంటనే చేరుకొని తక్షణమే ఆధారాలను సేకరించడం ఈ వ్యాన్ వల్ల అందుబాటులోకి వచ్చిందన్నారు. సంఘటన స్థలంలోనే ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశోధనలు చేయడం, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తో కమ్యూనికేషన్ లింక్ ఏర్పాటు చేయడం వల్ల రియల్ టైం డేటా మార్పిడి, నిపుణుల మార్గదర్శకత లభిస్తుందన్నారు.

నీడ దర్యాప్తులో వేగం, కచ్చితత్వం, న్యాయపరమైన ఆధారాల సమకూర్పులో నాణ్యత ఉంటుందని ఇది ప్రజల రక్షణకు ఒక ముందడుగుగా ఎస్పి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిఐ సత్యనారాయణ, ఆర్ ఐ భాస్కర్, ఫింగర్ ప్రింట్ ఎస్ ఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.