08-11-2025 12:54:52 AM
ఎల్బీనగర్, నవంబర్ 7 : ‘రోగులు ఇ బ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఆస్పత్రి ఎదుట గొడవ చేయొద్దు’ అని ఆస్పత్రి సిబ్బంది చెప్పితే.. ‘మమ్మల్ని వెళ్లిపోవాలా అంటావా?’ అని మద్యం మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. హాస్పిటల్ సిబ్బందిపై కత్తితో దాడి చేశారు. రిసెప్షినిస్టు కత్తిపోటుకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ప రిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ఎదుట జరిగింది. జెమ్ కిడ్నీ హాస్పిటల్ ఎదుట గురువా రం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొందరు మందుబాబులు మద్యం మత్తులో గొడవ పడుతున్నారు.
రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పిన హాస్పిటల్ సిబ్బందిపై ఆరుగురు వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో హా స్పిటల్ రిసెప్షనిస్ట్‌కు కత్తి పోట్లు పడ్డాయి. గమనించిన దవాఖాన సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నా మని డాక్టరు తెలిపారు.