08-11-2025 01:15:29 AM
ఫలించిన బీఆర్‌ఎస్ వ్యూహం
కేటీఆర్ ట్రాప్‌లో పడ్డ రేవంత్‌రెడ్డి
* ముస్లింవర్గాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లింలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ముస్లింలలో ఎంఐఎం ప్రాధాన్యత, ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం అసదుద్దీన్‌కు గిట్టకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చిచ్చు మొదలైంది.
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): రాజకీయక్షేత్రంలో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అపర చాణక్యుడు అనే విషయం అంద రికీ తెలిసిందే. ప్రత్యర్థులను తన వ్యూహాలతో బురిడీ కొట్టించడంలో ఆరితేరిన నాయకుడు కేసీఆర్. అయితే కేసీఆర్ రాజకీయ చతురతను, అనుభవాన్ని ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుణికిపుచ్చుకున్నారు. తండ్రికితగ్గ తనయుడు అనే విధంగా ప్రస్తుతం తన వ్యూహాలను అమలుపరుస్తున్నారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ల సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రచారంలో కేటీఆర్ అవలంబిస్తున్న రాజకీయ ఎత్తుగడలే ఇందుకు నిదర్శనం. అయితే కేటీఆర్ ఊహించిన విధంగానే కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ బుట్టలో పడినట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి జూబ్లీహిల్స్ మెట్రో పాలిటన్ నగరమైన హైదరాబాద్ పరిధిలో ఉంది. సహజంగానే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగా నమోదు అవుతుంది.
గత మూడు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో నమోదు అయిన పోలింగ్ శాతాన్ని గమనించినా ఇదే పరిస్థితి. గత మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేవలం 50 శాతానికి కాస్త అటు ఇటుగా పోలింగ్ నమోదైంది. అయితే మొత్తం ఓట్లలో కేవలం 30 శాతం ఓట్లను సాధించిన అభ్యర్థి గెలుపు పక్కా అవుతుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లో దాదాపు 25 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు.
దీంతో బీఆర్‌ఎస్, కేటీఆర్ ముస్లిం ఓటర్లను ఆకర్షించడంలో వ్యూహాత్మకంగా వ్యహరించారు. వ్యూహాలకు అనుగుణంగా కార్యాచరణ అవలంబించి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటర్లను దూరం చేయడంలో సఫలీకృతం అయ్యా రు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందడంలో ముస్లింలే కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఎంఐఎం పార్టీ కూడా బీఆర్‌ఎస్‌కు సహకరించడంతో గెలుపు మరింత సులువు అయింది.
అయితే ఉప ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు తారుమారు అయ్యా యి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ను బరిలో నిలిపింది. దీంతో బీసీ సామా జికవర్గంలోని ఇతర కులాల ఓట్లతోపాటు యాదవుల ఓట్లన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతాయని అంచనా వేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్‌యాదవ్ ఎంఐ ఎం పార్టీ నుంచి పోటీచేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపకుండా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్‌కు 30 వేల మెజార్టీ వ స్తుందని అంతా భావించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. తనకున్న వాక్చాతుర్యం, భాషా నైపుణ్యంతో అటు తెలుగు, ఇటు ఉర్దూలోనూ మాట్లాడి ముస్లిముంలను ఆకట్టుకున్నారు.
ముస్లింలకు కాం గ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో ముస్లింలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు కల్పిం చిన ప్రాధాన్యతను ముస్లింలకు వివరించారు. మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ రాజకీయ ఎత్తుగడలను అధికార పార్టీ పసిగట్టలేకపోయింది. కేటీఆర్ వేసిన ట్రాప్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పడిపోయారు.
రెంటికిచెడ్డ రేవడిలా కాంగ్రెస్..
జూబ్లీహిల్స్ రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్ లేవనెత్తిన మంత్రి పదవి అంశంతో ముస్లింల నుంచి పెరిగిన ఒత్తిడికి తలొగ్గిన సీఎం రేవంత్‌రెడ్డి ఉప ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నా అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే అజారు ద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతోనే అసలు సమస్య మొదలైంది. వాస్తవానికి ముస్లిం వర్గాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆధిపత్యాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లింలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉప ఎన్నికల సందర్భంగా ఎంఐఎం మద్దతుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సర్దుకుపోయారు. ఇదిలాఉండగా ముస్లింలలో ఎంఐఎం ప్రాధాన్యత, ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. అయితే అజారుద్దీన్‌కు మంత్రి పద వి ఇవ్వ డం అసదుద్దీన్‌కు గిట్టకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చిచ్చు మొదలైంది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా అసదుద్దీన్ మద్ద తు ప్రకటించడం, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్ తరఫున ప్రచారం పాల్గొనప్పటికీ తాజా పరిణా మాలతో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని స్పష్టమవుతుంది. దీంతో అసదుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు దూరంగా ఉండటమే కాకుండా కేవలం బీహార్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఎంఐఎం నాయకు లు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ సహకరించడం లేదు.
దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎంఐఎ ం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం లేదని అనడంతో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న చిచ్చుకు మరింత ఆజ్యం పోసినట్టు అయిం ది. దీంతో డామేజ్‌ను గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ను కూడా ప్రచారానికి దూరంగా ఉంచుతుంది. కాంగ్రెస్ అనాలోచితంగా ఎంఐఎం మద్దతు తీసుకోవడంపై కాంగ్రెస్‌లోని ముస్లింలు..
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముస్లింలు, ప్రస్తుతం ప్రచారానికి దూరంగా ఉంచడంతో అజారుద్దీన్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలతో మొత్తంగా జూబ్లీహిల్స్‌లోని ముస్లింల ఓట్లన్నీ బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ఉప ఎన్నికలపై పలు సంస్థలు చేసిన సర్వే నివేదికలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి.
దీంతో ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయంగా కన్పిస్తున్న ది. రేవంత్‌రెడ్డిని ట్రాప్‌లోకి దింపి, ముస్లింల ఓట్లను చాకచక్యంగా తమ వైపు తిప్పుడంలో కేటీఆర్ వ్యూహం సమర్థవంతంగా ఫలించింది. తద్వారా జూబ్లీహిల్స్ గడ్డపై మరోసారి గులాబీ జెండాను పాతేందుకు మార్గం సుగ మం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు.