08-11-2025 12:33:16 AM
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): హిందువులంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తమ సత్తా ఏందో కాంగ్రెస్‌కు రూచి చూపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ముస్లింల మెప్పు పొంద డానికి కాంగ్రెస్ యత్నిస్తోందని, ఈ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ (ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్య పోటీ జరుగుతోందని తెలిపారు. ఇక్క డ బీజేపీ విజయం సాధించబోతోందని బండి సంజయ్ జోస్యం చెప్పా రు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే తాపత్రయ పడుతుందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 80శాతంగా ఉన్న హిందువులు బీజేపీ ఓటు బ్యాంకుగా మారబోతున్నారని, వారంతా తమకు భరో సా ఇస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ పోటీ చేయాలా వద్దా? అనే ఆలోచనలో ఉందని, ముస్లిం ఓట్లను నమ్ముకుంటే వాళ్లు కాంగ్రెస్ దిక్కు వెళ్లిపోయారని తెలిపారు.
జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ వైపు ఉంటారా? ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? తేల్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గెలి స్తే ఎంఐఎం పార్టీ గెలిచినట్లేనన్నారు. కాం గ్రెస్ జెండాలు కనబడే చోట అన్నీ పచ్చజెండాలు కనబడుతున్నాయని, మరీ ఆ పచ్చ జెండాలు పాకిస్తాన్ జెండాలా? ఇంకా ఏ జెండాలో అర్థమవట్లేదన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లిం...ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
గోపీనాథ్ మరణంపై విచారణ జరపాలి
మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని, ఆస్తి పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరి మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని ఆయన ఆరోపించారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయాన ఆయన తల్లే ఆరోపించిందన్నారు. కన్న కొడుకు గోపీనాథ్ ముఖం ఆమెను చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్త వాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లద్దరూ పంచుకున్నారని, గోపీనాథ్ మర ణం, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపిం చే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా?. గోపీనాథ్ తల్లి ఆరోపణలపై ఇంతవరకు కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
బీజేపీ సభలకు అనుమతులివ్వడం లేదు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతం వ్యవహరించడం లేదని బండి సంజయ్ విమర్శిం చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారని, తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని, ఈరోజు (శుక్రవారం) మీనాక్షిపురం(రహమత్ నగర్)లో సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నామని, నిన్నటిదాకా దీనిపై స్పందించ లేదు... కానీ పొద్దున ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేద ని, వేరేచోట పెట్టుకోవాలని చెబుతున్నారని పేర్కొన్నారు. తాము ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే మాకు చెబుతున్నరంటే ఏమనాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్‌కు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభలకు అనుమతిస్తే... ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పట్టుకుందన్నారు.
జూబ్ల్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలిస్తే... చైన్ స్నాచర్లకు, గంజాయి విక్రేతలకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్, గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, సోలంకి శ్రీనివాస్, రితేష్ రాథోడ్ పాల్గొన్నారు.