08-11-2025 01:11:58 AM
తమాషాలు చేస్తే తాటతీస్తా..
విడతలవారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు. రేవంత్‌రెడ్డి వచ్చాకే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, అంతకుముందు ఈ సమస్య లేనట్లుగా మాట్లాడుతున్నారు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్లం కాదు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. తమాషాలు చేస్తే తాట తీస్తాం. వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తాం. ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే రేపు ఫీజులు అడగకుండా ఉంటారా..? ఆర్ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ ముందుకొస్తే వాళ్ల చేతికే చిట్టా ఇస్తానని, నాలుగు నెలలు ప్రభుత్వాన్ని మీరే నడపండి.
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ఓడితే.. హిందువులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని బండి సంజయ్ ఒప్పుకుంటారా? దీనిని ఆయన రెఫరెండంగా భావిస్తారా?
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : కేంద్రంలో, రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగరం ఎక్కువగా అభివృద్ధ్ది చెందినదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఏయిర్‌పోర్టు, మెట్రోరైలు వంటి అనేక ప్రాజెక్టులు అమలుచేశా మని తెలిపారు. 2014 నుంచి 2023 వర కు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది శూన్యమని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు కావొస్తుందని, భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలో విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని, కానీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్‌గా మారి అభివృద్దిని అడ్డుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. ఫూచర్ సిటీని, మెట్రో విస్తరణను, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, ఫ్లుఓవర్స్, నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొస్తామనుంటుంటే.. బ్యాడ్ బ్రదర్స్ (కిషన్‌రెడ్డి, కేటీఆర్) కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని సీఎం మండిపడ్డారు.
శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కు మార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఓట ర్లు బుద్ధి చెప్పాక బ్యాడ్ బ్రదర్స్‌కు మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలపారు. గతంలో పీజేఆర్, మర్రి శశిధర్‌రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా ఉండి నగరం అభివృద్దికి పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు.
పదేళ్ల కాంగ్రె స్ పాలన, ఆ తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్, బీజే పీ పాలనతో పాటు, ఈ రెండేళ్లలో తాముచేసిన అభివృద్ధి చేసి ఓటేయాలని సీఎం కోరారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి ఏమి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి నగరం మొత్తం అతలాకుతలం అయినా కూడా కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదని మండిపడ్డారు. కేటీఆర్ అనే ఒక విషపురుగుకు కిషన్‌రెడ్డి ఎందుకు లొంగిపోయాడో తెలియడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమకు ప్రజల మీద నమ్మకం ఉందని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను తప్పకుండా గెలుస్తామని, వారిలాగా చేయని పనులు చెప్పుకునే మనస్తత్వం తమది కాదన్నారు. ఏ ఎన్నికనైనా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని, పార్టీ అభ్యర్థి ఉన్న చోట తాను పోటీలో ఉన్నట్లే ఫీలవుతానని.. కేసీఆర్‌లా ఫామ్‌హౌస్‌లో పడుకోనని తెలిపారు. ప్రతీ ఎన్నిక తమ ప్రభుత్వ పనితీరుకు పరీక్షేనని, అండగా ఉంటే పదేళ్లలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు. సర్వేల గురించి తాను మాట్లాడనని, డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుంటున్నారని సీఎం ఆరోపించారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు..
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్షరాల రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు. రూ.16 వేల మిగులు బడ్జెట్, రూ. 69 వేల కోట్ల అప్పులతో ఉన్న తెలంగాణను ఈ దుస్థితికి తెచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు.. మా ప్రభుత్వం ఇప్పుడు అప్పు లు, వడ్డీల కలిపి నెలకు రూ. 6, 500 కడుతూనే.. అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
గత టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్ హయాంలో రాష్ర్టం అభివృద్ధి చెందిం ది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తిం పు రావడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు గంగ లో కలిపారు.
కేటీఆర్ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే రాష్ర్టంలో కొత్త సచివాలయం కట్టారు తప్ప.. రాష్ర్టం కోసం కాదు. ఈ కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. వాస్తు బాగలేదని, కేటీఆర్‌ను సీఎం చేయాలనే ఆలోచనతోనే కొత్త సచివాలయం కట్టారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బుల్లెట్ ప్రూప్‌లు..
కేసీఆర్ హయాంలో ప్రజా ధనం దుర్వినియోగం చేశారని, ఆయన ఉండే నివాసా ల్లో బుల్లెట్ ప్రూఫ్‌ను అమర్చుకున్నారని.. ఆయన ఒక భయస్తుడని సీఎం అన్నారు. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఏ భవనంలో అయితే ఉన్నాడో.. ఇప్పుడు నాకు కూడా అదే భవనం ఇచ్చారు.. ఆ బిల్డింగ్ డో ర్ల దగ్గర నుంచి బాత్రూముల వరకూ అన్నీ బుల్లెట్ ప్రూఫ్స్ అమర్చారు. ప్రజాభవ న్ పరిస్థితి ఏంటని భట్టి విక్రమార్కను అడిగితే.. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని చెప్పారు. మెయిన్ డోర్ల దగ్గర నుంచి బాత్రూమ్ డోర్ల వరకు ప్రజాభవన్‌లోనూ బుల్లెట్ ప్రూఫ్ పెట్టించుకున్నారు’ అని సీఎం చెప్పారు.
ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్..
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించిన బంద్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. విడతల వారిగా నిధులు విడుదల చేస్తామని, విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పారు. విద్యను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కళాశాలలైనా, రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేద న్నారు.
రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, అంతకు ముందు ఈ సమ స్య లేనట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలి వి తక్కువ వాళ్లం కాదు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్ ఏడెనిమిది కాలేజీలకు అనుమతులు అడిగితే కుదరదని చెప్పాం.
మహబూబ్‌నగర్‌కు చెందిన మరొకరు హాప్ క్యాంపస్‌కు అనుమతులు అడిగితే కుదరన్నాం. వాళ్లే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విడతల వారీగా ఫీజు లు విడుదల చేస్తామంటుంటే కాలేజీలు బంద్ చేస్తామని అంటున్నారు. వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు తెలా తీసుకుంటారో చూస్తాం... ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే రేపు ఫీజులు అడగకుండా ఉంటారా..? ఇం టర్, డిగ్రీ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి చేస్తామంటే రావడం లేదు’ అని సీఎం వివరించారు.
బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా అమాయకంగా వాళ్ల ఉచ్చులో పడ్డారని, ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ ముందుకొస్తే వాళ్ల చేతికే చిట్టా ఇస్తానని, నాలుగు నెలలు ప్రభుత్వాన్ని మీరే నడపండి అంటూ సీఎం అన్నారు. రాష్ట్రానికి ప్రతి నెల రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుందని, అందులో ఉద్యోగులు వేతనాలు, వడ్డీలకు కలిపి సుమారుగా రూ. 12 నుంచి 13 వేల కోట్ల వరకు చెల్లిస్తున్నామని, ఇక మిగిలిన రూ. 5 వేల కోట్లకు పైగా ఆదాయం నుంచి అభివృద్ది, సంక్షేమం, ఫీజు రీయింబర్స్‌మెం ట్స్ ఇతర ఖర్చులకు వాడుకోవాల్సి వస్తుందని సీఎం వివరించారు.
బీజేపీకి డిపాజిట్ రాదు.. బీఆర్‌ఎస్ గెల్వదు..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలువాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడ బీజేపీకి డిపాజిట్ రాదని, బీఆర్‌ఎస్ గెలవదని, ఈ విషయం రాసిపెట్టుకోవాలని సీఎం తెలిపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు మాత్రం బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ముస్లింలు ఓటేస్తే..
హిందువులందరు బీజేపీకి ఓటేయాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి బదులిస్తూ.. బీజేపీ ఓడితే.. హిందువులంతా బీజే పీకి వ్యతిరేకంగా ఉన్నారని సంజయ్ ఒప్పుకుంటారా..? దీనిని రెఫరెండంగా భావిస్తారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాగంటి గోపినాథ్ మరణంపై తాము వివాదం చేయదల్చుకోలేదని, కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదుచేస్తే విచార ణ జరిపిస్తామన్నారు. మాగంటి గోపినాథ్ తల్లి, ఆయన మొదటి భార్య కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు..
తెలంగాణలో ఇక నుంచి గంజాయి, డ్రగ్స్ అనే మాటే వినపడకూడదని సీఎం అన్నారు. గంజాయి, డ్రగ్స్ తెలంగాణలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలని చెప్పారు. ఎవరైనా గంజాయితో రాష్ర్టంలో దొరికితే.. ఒక్కొక్కడిని తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. ‘రాష్ర్టంలో ఈగల్ టీమ్ వ్యవస్థను తీసు కొచ్చి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతు న్నాం. హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి చెరువులు ఆక్రమణలు గురి కాకుండా కాపా డుతున్నాం.
కేటీఆర్ ఓ విషపురుగు.. నగరానికి గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చేందే కేటీఆర్. నగరంలో అత్యాచారాలకు గం జాయి, డ్రగ్సే కారణం. బీఆర్‌ఎస్ హయాంలో సినిమా ఇండస్ట్రీని ఎలా వాడుకున్నారో.. హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు’ అని విమర్శిం చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని పదే పడే రౌడీ అని ప్రచారం చేస్తున్నార ని, దీపావళి రోజున డ్రగ్స్ వాడేవాడు రౌడీనా..? నిత్యం ప్రజల్లో ఉండే వాడు రౌడీనా..? ప్రజలు తెలుసుకోవా’లన్నా రు. మైనార్టీ నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కూడా బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదన్నారు.
ఒక్కొక్కరిని హరీశ్ బయటికి పంపుతున్నారు..
బీఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక్కొక్కరిని చాకచక్యంగా బయటికి పంపిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చివరకు కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా విడదీస్తున్నారని, ఆ కుటుంబం నుంచి కవితను సక్సెస్‌పుల్‌గా బయటకు పంపారని తెలిపారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉండే వాళ్లు ఆలె నరేంద్ర, జగ్గారెడ్డి, రఘునందన్‌రా వు, విజయశాంతి, ఈటల రాజేందర్‌తోపాటు అనేక మందిని హరీశ్‌రావు బయటకు పంపారని, ఈ విషయం కేటీఆర్‌కు అర్థం కావడం లేదన్నారు.
డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది..
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రా నికి తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘రాష్ట్రాన్ని కొళ్లగొట్టి కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించికున్న ది... కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అక్ర మ సంపాదనతో ఫామ్‌హౌజ్‌లు నిర్మించుకున్నారు. నిరుద్యోగులను కూడా పదేళ్ల పాటు ఎంతో ఇబ్బంది పెట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 70వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.
ఉద్యోగాల మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తారని.. బహిరంగంగా ఎల్బీ స్టేడియంలో దృవీకర ణ పత్రాలు ఇచ్చాం. కేసీఆర్ తెలంగాణకు చేసింది ఒక్కటే.. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కల్చర్ పెంచారు. కంటోన్మెంట్లో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. రేపు జూబ్లీహిల్స్లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండూ కలిసి కుట్రపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నా యి కాబట్టే.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచార ణకు తమ ప్రభుత్వం కోరి మూడు నెల లు గడస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కమి షన్ విచారణ జరుపుతుంటే.. కేసును సీబీఐకి ఇవ్వాలని కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పదే పదే డిమాండ్ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇక ఫార్ములా ఈఫూ కార్ రేసు విషయంలో కేటీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి గవర్నర్ ఆమో దం తెలపడం లేదన్నారు. ప్రజా ప్రతినిధి పై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు, చర్యలు తీసుకోవడానికి గవర్నర్ ఆమో దం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.