సీజనల్ వ్యాధుల నియంత్రణకే డ్రై డే
మున్సిపల్ కమిషనర్ యాదగిరి
చేవెళ్ళ ఆగష్టు 6 (విజయక్రాంతి): చేవెళ్ల పురపాలక సంఘం పరిధిలోని పట్టణ ప్రజలకు దోమల వృద్ధిని అరికట్టడం, డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడం కోసం ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించబడుతుందని స్థానిక మున్సిపల్ కమీషనర్ గదగిరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇల్లు, కార్యాలయాలు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను తొలగించడం ద్వారానే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని పురపాలక సంఘం అధికారులు తెలిపారు. ప్రజలు పాటించవలసిన కొన్ని సూచనలు. కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, పూల కుండీలు తదితర వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.
నీటి ట్యాంకులను తరచూ పరిశీలించి, మూతలు సక్రమంగా ఉండేలా చూసువాలన్నారు. చెత్త, ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని చెప్పారు. తోక పురుగులు ప్రాంతాలను గుర్తించి సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచి రక్షిత మంచినీటిని మాత్రమే వినియోగించాలన్నారు. జ్వరం తలనొప్పి శరీర నీరసం లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. డ్రై డే కొరకు ప్రతి కుటుంబం మంగళ, శుక్రవారం 10 నిమిషాలు కేటాయించాలాన్నారు.






