7 August, 2026 | 2:29 AM

కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి

07-08-2026 12:00 AM
  1. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారణ
  2. డిజిటల్ ఆధారాల సేకరణపై పోలీసుల దృష్టి

రంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో గురువారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు.

డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులు విచారణను ప్రతిష్టాత్మకంగా, అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఉదయ్‌కృష్ణారెడ్డి మొబైల్‌ఫోన్, ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని, చాట్స్, కాల్ డేటా ఆధారాలను సేకరిస్తున్నారు.