19-11-2025 05:45:04 PM
కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు..
కమాన్ పూర్ (విజయక్రాంతి): బాధిత కుటుంబానికి దుద్దిళ్ల చేయూత పథకంలో కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు బియ్యం అందజేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాలతో బుధవారం కమాన్ పూర్ గ్రామానికి చెందిన మెతుకు మల్లేష్ అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారి కుటుంబానికి బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంతం శ్రీనివాస్, గొడిసల సారయ్య, లల్లు, కామేర నరేష్, బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.