calender_icon.png 19 November, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యం నడకే సంపూర్ణ ఆరోగ్యం

19-11-2025 06:47:33 PM

ఎస్సై చల్లా రాజు..

వాకర్స్‌ లకు టీషర్టుల పంపిణీ..

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): నిత్య నడకే సంపూర్ణ ఆరోగ్యమని వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు అన్నారు. మండల కేంద్రంలోని ఉదయ నడక కార్యక్రమంలో పాల్గొంటూ ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తున్న వాకర్స్‌ లకు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కొట్టి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా ముద్రించిన టీషర్టులను ఎస్సై చల్లా రాజు చేతుల మీదుగా వారికి అందజేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజు మాట్లాడుతూ.. నిత్యం నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువత తమ రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతిరోజు కొంతసేపు వాకింగ్ చేస్తే శరీరం చురుకుగా, మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇదే సులభమైన మార్గమని అన్నారు.

అనంతరం మామిడిశెట్టి కోటి మాట్లాడుతూ.. నేటి జీవనశైలిలో వ్యాయామం చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు కనీసం అరగంట పాటు వాకింగ్ చేయాలని అన్నారు. వాకర్స్‌ గ్రూప్‌కు చెందిన సభ్యులు అందించిన ఈ ప్రోత్సాహానికి సంతోషం వ్యక్తం చేస్తూ, టీషర్టుల పంపిణీ తమపై ఉన్న నమ్మకానికి గుర్తుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ టీమ్ బానోత్ యోగి, అజ్మీర రమేష్, మంద రమేష్, వడ్డేపల్లి నగేష్, రెడ్డి శ్రీధర్, ఆకుల సుమన్, పల్నాటి కోటి, మామిడిశెట్టి ధర్మతేజ, పసునూటి నవీన్ లు పాల్గొన్నారు.