19-11-2025 06:40:38 PM
రేగోడు మండల యువ నాయకుడు చక్రపాణి..
రేగోడు: పాఠశాల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని మండల యువ నాయకులు రేగోడు గ్రామానికి చెందిన చేన్నయ్య గారి చక్రపాణి అన్నారు. బుధవారం ఆయన బృందంతో కలిసి మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ లోని అక్షయపాత్ర భోజనాన్ని మోడల్ స్కూల్ తరగతి గదలను పరిశీలించారు. మోడల్ స్కూల్లో స్టేజి పైకప్పు నిర్మాణాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని అన్నారు. మోడల్ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.