19-11-2025 06:50:27 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ... దివంగత మాజీ ప్రధాని ధైర్య సాహసాలతో ప్రధానమంత్రి పదవి నిర్వహించడం జరిగిందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఉక్కు మహిళగా పేరు పొందడం జరిగిందని, ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో దేశాన్ని ముందుకు నడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం, వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, నాయకులు చెన్ని బాబు,షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, నంది కిషన్, బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.