calender_icon.png 19 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ యార్డ్ లో రైతుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి

19-11-2025 05:48:35 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి మార్కెట్ యార్డ్ లో రైతు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యార్డులో నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులు స్వయంగా పరిశీలించారు. మొక్కజొన్న పంటను విక్రయించి ఇరవై రోజులు అయినా చెల్లింపులు జరగకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు.

ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న కొన్ని విధానాల కారణంగా చెల్లింపులలో జాప్యం జరుగుతూ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని రైతులు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలిముద్ర విధానం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సిబ్బంది, యంత్రాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, ధాన్యం కొలిచిన వెంటనే డిజిటల్ ఎంట్రీలు పూర్తి చేసి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. రైతులకు నష్టం కలిగించే విధానాలను వెంటనే పునఃసమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.