calender_icon.png 19 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూనె గింజల పంటల సాగుతో అధిక లాభాలు

19-11-2025 06:28:14 PM

గజ్వేల్: నూనె గింజల పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. గ్రామాలలో నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ జాతీయ నూనె గింజల పథకము ఆధ్వర్యంలో ఏడిఏ గజ్వేల్ బాబు నాయక్ పర్యవేక్షణలో గజ్వేల్ ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులకు పొద్దుతిరుగుడు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏడిఏ బాబు నాయక్ మాట్లాడుతూ నూనె గింజల పంటలకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా రైతులందరూ పొద్దుతిరుగుడు పంట సాగుకు ముందుకు రావాలని, ఈ పంట సాగు విధానంపై రైతులకు పూర్తి వివరాలు, లాభాలు వివరించారు. కార్యక్రమంలో ఏవో నాగరాజు, ఏఎంసి డైరెక్టర్ రామగౌడ్, ఆత్మ డైరెక్టర్ రాంచంద్రరెడ్డి, ఏఈఓలు అంజలి, మాధవి, ప్రతినిధులు రవీంద్రచారి, కరుణాకర్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.