calender_icon.png 20 November, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి

20-11-2025 12:18:50 PM

మెట్ పల్లి, (విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్(Metpally Municipal) పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి అవుతాయని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. గురువారం ఆయన పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ లికేజి మరమత్తు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లీకేజ్  పనులు రెండు రోజులలో పూర్తవుతాయని సంబంధిత సూపర్వైజర్ తెలపడం జరిగిందని అన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరం ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సూపర్వైజర్ దినేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ పాల్గొన్నారు.