calender_icon.png 20 November, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం

20-11-2025 12:11:49 PM

పాట్నా:  బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్(Chief Minister Nitish Kumar) రికార్డు స్థాయిలో 10 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్(Arif Mohammad Khan) ఆయనతో ప్రమాణం చేయించారు. బీహార్ కేబినెట్(Bihar Cabinet) మంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఇతర ఎన్డీఏ నాయకుల సమక్షంలో నితీష్ కుమార్ 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

బీహార్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్డీయే నాయకులు

విజయ్ కుమార్ చౌదరి - జెడి(యు)

బిజేంద్ర ప్రసాద్ యాదవ్ - జెడి(యు)

శ్రవణ్ కుమార్ - జెడి(యు)

మంగళ్ పాండే - బిజెపి

దిలీప్ కుమార్ జైస్వాల్ - బిజెపి

అశోక్ చౌదరి - జెడి(యు)

లేసి సింగ్ - జెడి(యు)

మదన్ సహాని జెడి(యు)

నితిన్ నబిన్ - బిజెపి

రామ్ కృపాల్ యాదవ్ - బిజెపి

సంతోష్ కుమార్ సుమన్ హెచ్‌ఏఎం(ఎస్)

సునీల్ కుమార్ జెడి(యు).