calender_icon.png 14 August, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల వినియోగం వల్ల

14-08-2025 12:32:24 AM

భవిష్యత్ అంధకారం: డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

 కోదాడ, ఆగస్టు 13: మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్ అంధకారం అవుతుందని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  పాల్గొని మాట్లాడారు.

మత్తుపదార్థాలు ఉపయోగించినా, రవాణా చేసిన చట్ట రిత్యా నేరమన్నారు. మత్తు పదార్థాల కేసుల్లో విద్యార్థులు ఇరుక్కుంటే  మంచి  భవిష్యత్తు  కోల్పోయి జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.

డ్రగ్స్ రహిత భారత దేశంగా తీర్చిదిద్దుతామంటూ మత్తుకు దూరంగా ఉండాలని డీఎస్పీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, అనంతగిరి ఎస్‌ఐ నవీన్ కుమార్, కళాశాల డైరెక్టర్ నవమన్, కృష్ణారావు నాగ ప్రసాద్ గోపిరెడ్డి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.