calender_icon.png 14 August, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు బాగు చేయాలని నిరసన

14-08-2025 12:33:16 AM

బూర్గంపాడు,ఆగస్టు13,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సారపాక-ఇరవెండి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేప ట్టారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

మండలంలోని బీటీ రోడ్ల దుస్థితిని గమనించి ఆర్ అండ్ బి అధికారులు యుద్ధ ప్రా తిపదికన సంబంధిత రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు.

లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట నాయకులు ఏనుగు వెంకట రెడ్డి, జిల్లా నాయకులు చుక్కపల్లి బాలాజీ, కే సగాని శ్రీనివాస్ గౌడ్, , కోడెబోయిన రవి పటేల్, బిఆర్‌ఎస్ నాయకులు లక్ష్మి చైతన్య రెడ్డి, చల్లకోటి పూర్ణచంద్ర బెజ్జంకి కనకాచా రి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.