calender_icon.png 14 September, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి

14-09-2025 08:18:48 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విద్యా సంస్థలకు బకాయి పడిందని భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి బి వి ఎం విట్టల్ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలు నుండి ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు నిధులను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు.

ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వ , ప్రవేట్ కళాశాలలో రియంబర్స్మెంట్ రాకపోవడంతో డబ్బులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని కళాశాల అధికారులు, యజమాన్యాలు అంటున్నారు. ప్రవేట్ కళాశాలలు కూడా మూతపడే అవకాశం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయకపోతే భారతీయ విద్యార్థి మోర్చ, ఇతర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.