04-10-2025 07:40:50 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పట్టణ కేంద్రంలోని దేవిగార్డెన్ లో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు నిమజ్జనానికి బయలుదేరిన దుర్గాదేవి. ప్రతిరోజు నిరంతరం పూజలందుకొని కోరిన వారి కోరికలను తీర్చే తల్లిగా నిత్యం అవతరించింది. చివరి రోజైన శనివారం నిమజ్జనానికి భారీ ఏర్పాట్ల మధ్య బయలుదేరింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల కళాకారుల నృత్యాలతో మేళ తాళాలతో రహదారి శోభాయమానంగా కనిపించింది. అనేకులు ఈ శోభయాత్రను వీక్షించి ఆనంద డోలికల్లో మునిగి తేలియాడారు.