04-10-2025 07:40:14 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో జమలారెడ్డి కోరారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, అన్ని పార్టీలు నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య, ఏవో శంకర్, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.