04-10-2025 07:44:48 PM
గాంధారి (విజయక్రాంతి): రైతులు చీడ పురుగుల నుండి పంటలను రక్షించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజలింగం అన్నారు. ఈ మేరకు శనివారం రోజున గాంధారి మండలంలోని నేరల్ శివారులోని వరి, పత్తి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి ఆరతితో కలిసి పరిశీలించారు. పంట పరిశీలనలో భాగంగా ప్రస్తుతం వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు, మెడవిరుపు, సుడిదోమను పత్తిలో రసం పీల్చు పురుగులను గమనించడం జరిగింది.
రైతులు ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటమైసిన్ 80ml ఎకరానికి+ కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600grams, or అగ్రిమైసిన్ 80ml+కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600ml ఎకరానికి 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలని, అదేవిధంగా వరిలో రైస్ గంధి బగ్ స్పైరోమేసిఫిన్ 22.9% 100ml ను ఎకరానికి పిచికారీ చెయ్యాలి అని సూచించడం జరిగింది. పత్తి పంటలో రసం పీల్చు పురుగుల నివారణకు అసిటమిఫ్రిడ్ 40 గ్రాములు ఎకరానికి లేదా థాయోమితాక్సిన్ 60గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. మెడవిరుపు అగ్గితెగులు నివారణకు పైకాక్సీస్టోబిన్ 6.78% w/w +ట్రీసైక్లోజల్ 20.33% 400 ml ను 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చెయ్యాలి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మాలోత్ గబ్బర్సింగ్, బామాన్ నారాయణ మొదలైనవారు పాల్గొనడం జరిగింది.