30-09-2025 06:54:20 PM
నాగారం: మండల ప్రజలు దసరా ఉత్సవాలను శాంతియుత వాతావరణ జరుపుకోవాలని అల్లరి చేసి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ యాకూబ్ తెలిపారు. స్థానిక ఎన్నికల దృశ్య ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు చేయకూడదని ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం నిషేధమని అదేవిధంగా వాట్స్అప్ గ్రూపులలో పార్టీలకు సంబంధించిన పోస్టులు పెట్టరాదని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.