calender_icon.png 18 October, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు

17-10-2025 11:57:39 PM

చిట్యాల,(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగను ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయ దుస్తువులలో అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటామని, ఈ పండగలో పూర్వకాలం నుండి శాస్త్రీయ విజ్ఞానం దాగుందని తెలియజేశారు.

కాలానుగుణంగా దక్షిణ భారతదేశంలో వచ్చే అంటువ్యాధులను రక్షించుకోవడానికి పూర్వకాలంలో పంచ తైలాలను ఉపయోగించి మానవాళికి అంటు వ్యాధులు రాకుండా ఈ పండుగ నివారించేదని , ఇటువంటి శాస్త్రీయ విధానం భారతదేశంలో తప్ప ఇంకా ఏ దేశంలో లేదని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.