18-10-2025 12:00:00 AM
బీసీ జాక్ చైర్మన్ వేణుగోపాల్ గౌడ్
హన్మకొండ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు పోరాటాలను ఉదృతం చేస్తామని, అందులో భాగంగా శనివారం బందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ జనాభా లో సగ బాగానికి పైన 60% ఉన్న బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కోసం జీవో నెంబర్ 9 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంతో బీసీలు రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది అగ్రవర్ణాల వ్యక్తులు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించాయి, దీనితో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పైన హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదల కు గండిపడింది.
బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై తెలంగాణా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు 18న ’బంద్ ఫర్ జస్టిస్’ పేరుమీద రాష్ట్ర బీసీ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. రేపు జరగబోయే బంద్ కు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ, టిజిఫ్, అలాగే ప్రజా సంఘాలు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, గిరిజన సంఘాలు మరియు మావోయిస్టు అన్ని విద్యార్ధి సంఘాలు బంద్ కు మద్దతు ఇచ్చినందుకు వారిందరికి కృతజ్ఞతలు తెలిపారు.
రేపు జరగబోయే బంద్ కు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్య సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హల్ లు, బ్యాంకులు, చిట్ ఫండ్స్, చిరు వ్యాపారస్థులు, రవాణా కు సంబందించి ఆర్టీసీ బస్సులు, ఆటోలు బంద్ లో పాల్గోని బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు.ఈ రోజు కార్యక్రమంలో బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ చైర్మన్ దొడ్డపల్లి రఘుపతి, వైస్ చైర్మన్, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మల శోభరాణి, కోఆర్డినేటర్ తంగళ్లపెల్లి రమేష్, అరేగంటి నాగరాజు పాల్గొన్నారు.
ప్రజలందరూ ఐక్యంగా మద్దతు తెలపాలి..
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు అందిస్తుందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ జేఏసి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల తో కలిసి నాయిని రాజేందర్ రెడ్డి బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రేపు తెలంగాణ బంద్ కి సంబదించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ సమాజం హక్కుల కోసం, సామాజిక న్యాయం సాధన కోసం చేస్తున్న ఈ బంద్ చారిత్రాత్మక పోరాటం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకట్ట వేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే. బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికీ బహిర్గతమైంది. ప్రజల హక్కులను అడ్డుకోవడం, సామాజిక న్యాయాన్ని నిరాకరించడం వారి అలవాటు.
అందుకే ఈ బంద్ కేవలం బీసీల కోసం మాత్రమే కాదు న్యాయం, సమానత్వం కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన రోజు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఖిలపక్ష ప్రతినిధులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రజల హక్కుల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అని విమర్శించారు. హనుమకొండ జిల్లా ప్రజలందరూ, యువత, మహిళలు, సామాజిక సంస్థలు బీసీ బంద్ విజయవంతం చేయాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీల హక్కుల కోసం జరిగే ఈ ఉద్యమం న్యాయం కోసం చేసే యుద్ధం అందరూ ఐక్యంగా పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్ మద్దతు..
18వ తారీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు నిర్వహించనున్న బంద్ కు కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. శుక్రవారం ఎస్ డి ఎల్ సి ఈ లోని పూలే విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసీ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డాక్టర్ తిరునహరి శేషు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగులు వ్యాపారస్తులు మేధావులు కార్మిక వర్గాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు బంద్ ను విజయవంతం చేసి బీసీలకు రావాల్సిన 42% సాధించడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు,బిసి టీచర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య, బిసి టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్,డాక్టర్ విజయ్,డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్,డాక్టర్ రాధిక,డాక్టర్ మల్లేష్,డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.