calender_icon.png 18 October, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దెమర్రి గుడ్ షెఫర్డ్ స్కూల్‌లో దారుణం

18-10-2025 12:00:00 AM

క్లాస్ వర్క్ చేయలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్ 

శామీర్ పేట్ , అక్టోబర్ 17 ( విజయక్రాంతి): హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని టీచర్ చితక బాదిన ఉదంతం శుక్రవారం శామీర్‌పేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ఉద్దెమర్రి గ్రామానికి చెందిన మహేష్ బాబు అదే గ్రామంలో గుడ్ షెపర్డ్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే మహేష్ బాబు క్లాస్ వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యా యురాలు శోభారాణి కర్రలతో తీవ్రంగా కొట్టింది. వెంటనే బాలుడి నానమ్మ స్కూల్‌కి వెళ్లి ప్రశ్నించగా అక్కడ టీచర్,  ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో ఎంఈఓకి ఫిర్యా దు చేసింది. దీంతో స్పందించిన ఎంఈఓ విచారణ చేపడతామని తెలిపారు.