calender_icon.png 19 March, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం

09-02-2025 09:09:27 AM

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం(Earthquake ) వచ్చింది. హోండురాస్‌కు ఉత్తరాన 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్(German Research Center for Geosciences) తెలిపింది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్లు) లోతులో ఉందని జీఎఫ్ జెడ్ తెలిపింది. కరేబియన్ సముద్రం, హోండురాస్‌కు ఉత్తరాన భూకంపం సంభవించిన తర్వాత సునామీ హెచ్చరికలు ఉన్నట్లు యుఎస్ సునామీ హెచ్చరిక(US Tsunami Warning) వ్యవస్థ తెలిపింది. 

భూకంపం తర్వాత యుఎస్ అట్లాంటిక్ లేదా గల్ఫ్ కోస్ట్‌లో సునామీ వచ్చే అవకాశం లేదని యుఎస్ నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్(US National Tsunami Warning Center) తెలిపింది. భూకంపం తర్వాత యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు కూడా సలహాలను జారీ చేసింది. 10 కి.మీ లోతులో భూకంపం తీవ్రత 7.6గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొలంబియా(Colombia), కెమెన్ ఐలాండస్, కోస్టారికా, హోండురస్(Honduras), నికరగువ, క్యూబా దేశాలపై భూకంపం ప్రభావం పడింది.