calender_icon.png 31 August, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజార్ ఎంపికతో జూబ్లీహిట్!

31-08-2025 01:13:02 AM

  1. బరిలో బీసీ అభ్యర్థిని దింపనున్న కాంగ్రెస్! 
  2. తెరపైకి నవీన్‌యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లు
  3. సినీ గ్లామర్ కావాలనుకుంటే మెగాస్టార్ చిరంజీవి? 
  4. కాలం కలసివస్తే అజార్‌కు మంత్రి పదవి!

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి) :  తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా కోదండరాంతో పాటు అజారుద్దీన్‌ను ఎంపిక చేస్తూ శనివారం క్యాబినెట్ నిర్ణయించింది. అజారుద్దీన్‌ను మండలికి పంపించాలన్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  మొన్నటివరకు ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీఖాన్‌ను పక్కనపెట్టి అనూహ్యంగా అజారుద్దీన్ పేరును ఖరారు చేయడం చర్చనీయాంశమైంది.

ఓ వైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అజారుద్దీన్ ను ఉన్నట్టుండి శాసనమండలికి పంపించాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన వెనుక వ్యూహం ఏమిటనేది  ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  సమీకరణాల దృష్ట్యా అజారుద్దీన్ ఎమ్మెల్సీగా విజయం ఖాయం కావడంతో పాటు ఆయనకు డబుల్ బోనస్ దక్కబోతున్నదని టాక్ వినిపిస్తోంది. 

జూబ్లీహిల్స్‌ను హస్తగతం చేసు కునేందుకు అధికార కాంగ్రెస్  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించింది. నియో జకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డివిజన్ల వారిగా పార్టీ కార్య కర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరా రు చేయడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. తాజా పరిణామాలతో ప్రస్తుతం మరికొంత మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ నినాదం బలంగా వినిపిస్తుండటంతో జూబ్లీహిల్స్‌లో బీసీ సామా జిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా అజారుద్దీన్ పోటీ చేసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్ యాదవ్, బొంతురామ్మోహన్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తుండగా, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్‌గా ఉన్న రోహిన్ రెడ్డి పేరు కుడా వినిపిస్తున్నది. మరోవైపు సిని మా రంగంనుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ అధికార కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఓటర్లతో పాటు సిని మా పరిశ్రమకు చెందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. కనుక, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరు గుతున్నది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి కు టుంబ సభ్యులే పోటీ చేస్తారని ఇందుకు ఆ పార్టీ అధిష్ఠానం సైతం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ స్థానం కావడం, స్థానిక ప్రజ లతో ఆ కుటుంబానికి అనుబంధం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థి విషయంలో లోకల్ ఫ్లేవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ మైనార్టీయేతర వ్యక్తిని రంగంలోకి దింపుతుందనే అంచనాతో పాటు బీజేపీ సైతం మైనార్టీ ఇష్యూను తమ అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ సైతం మైనార్టీయేతర వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటించి, ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కాగా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పాత్ర కీలకమే.. 

జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ముస్లిం మైనార్టీలో ఓట్లు దాదాపు లక్షకుపైగా ఉంటాయి. వీరిలో మెజార్టీగా మజ్లిస్ పార్టీకే అనుకూలంగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్, ఎంఐఎం నుంచి ఎండీ రసీదు పరిదుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి, ఇతరులు పోటీ చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై 16,333 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇక బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 , ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు పోలైనాయి. ఇప్పుడు ఉపఎన్నికలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు అధికార పార్టీ అన్నిరకాలుగా ఎత్తులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపుతుందా.. లేఖ కాంగ్రెస్ అనుకూలంగా పనిచేస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. 

మంత్రిగా అజారుద్దీన్..?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, పార్టీ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా గెలవకపోవడంతో కేబినెట్‌లో ఆ వర్గానికి స్థానం దక్కలేదు. అలాగే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ జిల్లాకు సైతం మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ క్రమంలో హైదారాబాద్‌కు చెందిన మైనార్టీ వ్యక్తి మీర్ అలీఖాన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.

ఈ క్రమంలో అజారుద్దీన్‌ను అనువ్యూహంగా ఎమ్మెల్సీగా ప్రకటించడం వెనుక ఈయనను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు మైనార్టీ కోటా, హైదరాబాద్ జిల్లా కోటా కింద అజారుద్దీన్‌కు మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ అజారుద్దీన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇది ఆయనకు మంత్రి పదవి రావడంలో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. 

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, ఎమ్మెల్సీగా గెలుపొందినా మంత్రి పదవి విషయంలో అజారుద్దీన్ అదృష్టాన్ని ఖరారు చేసేది మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే అనే చర్చ తెరపైకి వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరో మైనార్టీ నేతను రంగంలోకి దింపకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపితే అజారుద్దీన్ కు మంత్రి పదవి దాదాపు ఖాయం అని, అలా కాకుండా మైనార్టీ నేతనే బరిలోకి దింపినా అజారుద్దీన్ మంత్రి పదవి ఆశలపై మరింత ఉత్కంఠ తప్పదనే టాక్ వినిపిస్తోంది.