calender_icon.png 31 August, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్‌పై కాంగ్రెస్‌ది బురద రాజకీయం

31-08-2025 12:51:49 AM

  1. నివేదికపై ఒక్క రోజు కాదు..నాలుగు రోజులైన చర్చిద్దాం 
  2. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాలి 
  3. యూరియా, పంట నష్టం తదితర అంశాలపై చర్చించాలి 
  4. కాంగ్రెస్, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయి 
  5. సమస్యలపై చర్చించకుండా పారిపోవాలని చూస్తోంది 
  6. కాంగ్రెస్‌పై మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకుల పిల్లల మరణాలు సహా ఇతర ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వకుండా రెండు రోజులే  సభ నడుపుతామని ప్రభుత్వం చె ప్పడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పెట్టి బురద రాజకీయాలకు పా ల్పడాలని చూస్తున్నట్టు ఉందన్నారు.

ఒక్కరోజు కాదు.. నాలుగు రోజులైనా సరే కాళేశ్వ రం కమిషన్‌పై మాట్లాడదామని ప్రభుత్వాని కి సవాల్ చేశారు. కానీ ప్రజలు కష్టాల గురిం చి ముందు చర్చిద్దామని కోరారు. రేపు సభ లో ఏం చర్చిస్తారో రాత్రి 9 తర్వాత తెలుపుతామని సమాధానం ఇచ్చారని. రేపు అసెం బ్లీలో పెట్టే చర్చ గురించి సమాచారం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎలా ప్రిపేర్ అవుతాయ ని ఆయన సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు.

ప్రజాపాలన తమదంటూ రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని తిరిగే రాహుల్‌గాంధీ ఏమని స మాధానం చెబుతారని ప్రశ్నించారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద మాట్లాడుతూ చాలా గ్రామాల్లో కరెంటు, రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నా రు. మొదటి ప్రాధాన్యత కింద రాష్ర్టంలో వరదల వల్ల జరిగిన ప్రాణ, పంట నష్టంపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్‌ఎస్ పార్టీ కోరిందన్నారు. రెండో ప్రధానమైన సమస్య యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

 కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు 

 కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. యూరియా కొరతకు కార ణం బీజేపీ, కాంగ్రెస్ అన్నదానిపై చర్చిద్దామమని కోరామన్నారు. ఎరువుల కొరత తీర్చేం దుకు అసెంబ్లీలో చర్చించాలని బీఆర్‌ఎస్  కోరిందన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహ ణ సరిగ్గా లేక మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని  విమర్శించారు. అంటురోగాలపై చర్చిం చాలని, గురుకులాల్లో 100కు పైగా మరణా లు జరిగాయని వాటిపై చర్చించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాలని కోరినట్లు చెప్పారు. 

రెండు రోజుల్లో సమస్యలపై ఎలా చర్చిస్తరు?

ఫోర్త్ సిటీలో సీఎం సోదరులపై వస్తున్న అరాచకాలపై, ఉద్యోగుల పీఆర్సీడీఎల్‌ఐ గు రించి, బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించాలని కోరామన్నారు. అయితే రెండే రోజులు అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నదని, రెండు రోజుల్లో ఇన్ని సమస్యలపై ఎలా చర్చిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభ వాయిదా వేసుకుని పారిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

వరదలతో ఇ బ్బంది పడుతున్న ప్రజల కష్టాల గురించి చ ర్చిద్దామంటే బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పడుతున్న బాధ ల గురించి మాట్లాడడానికి ముందుకు రావ డం లేదన్నారు. వరదలపై, యూరియా కొరతపై మాట్లాడటం కంటే ప్రభుత్వానికి ఇంకే మి ప్రాధాన్యత ఉంటుందని నిలదీశారు.