31-08-2025 08:55:06 AM
జేఈఈ మెయిన్స్ లో సీట్ సాధించన జగదీశ్వరిని అభినందించిన స్థానిక ఎస్సై వెంకటేష్
ముప్పనపల్లి సహాయ నిధిలో దాతల సహాయం మరువలేనిధి
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి ప్రమీల-తిరుపతి పెద్ద కుమార్తె కుమ్మరి జగదీశ్వరి ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా(Central University of Haryana)లో సీటు సంపాదించడం జరిగింది. కుమ్మరి జగదీశ్వరి హర్యానా రాష్ట్రం సెంట్రల్ యూనివర్సిటీలలో జేఈఈ అడ్వాన్స్డ్ 39995 ర్యాంకు సాధించింది. జగదీశ్వరి 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు బుట్టాయిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివింది 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మడికొండ సోషల్ వెల్ఫేర్ గురుకుల కళశాలలో చదివారు.
హర్యానా రాష్ట్రంలో చదవడానికి ఒక సంవత్సరానికి 1 లక్ష రూ. ఖర్చులు అవుతుందని తల్లి సహాయం చేయగలరని ముప్పనపల్లి సహాయ నిధి వారిని కోరారు. అనంతరం ముప్పనపల్లి సహాయ నిధి సహకారంతో దాతల సహాయంతో శనివారం రోజు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో 10వేల రూ. ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ మారుమూల గ్రామమైన బుట్టాయిగూడెంలో పుట్టి జేఈఈ మెయిన్స్ లో సీటు సాధించిన జగదీశ్వరిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జాడి రాంబాబు,అబ్బు సతీష్ తిప్పనపల్లి విజయ్,నామని రాజేష్,ఎగ్గడి వెంకటేశ్వర్లు,సునార్కని సురేందర్ కుమ్మరి రవి తదితరులు పాల్గొన్నారు.